New income tax bill: సోమవారం పార్లమెంటులో కొత్త ఆదాయపన్ను బిల్లు..!

by Shamantha N |
New income tax bill: సోమవారం పార్లమెంటులో కొత్త ఆదాయపన్ను బిల్లు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆరు దశాబ్దాల క్రితం అమల్లోకి వచ్చిన 'ఆదాయపు పన్ను చట్టం-1961' స్థానాన్ని 'నూతన ఆదాయపు పన్ను బిల్లు' భర్తీ చేయబోతోంది. 'నూతన ఆదాయపు పన్ను బిల్లు' పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కొత్త ఐటీ బిల్లు కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర బడ్జెట్ సెషన్‌లో భాగంగా సోమవారం దీన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ బిల్లును ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపుతారు. ఈ విషయాన్ని ఇటీవలే పార్లమెంటు వేదికగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా వెల్లడించారు. డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ అని పిలిచే కొత్త చట్టాన్ని ప్రస్తుత పన్ను నిర్మాణాన్ని సరిదిద్దడం, దాన్ని మరింత క్రమబద్ధీకరించడం, పారదర్శకంగా మార్చడమే లక్ష్యంగా తెస్తున్నారు.

కొత్త బిల్లు ఉద్దేశం ఏంటంటే?

ఈ బిల్లులో ఎలాంటి కొత్త పన్నులుప్రవేశపెట్టలేదని.. పన్ను చట్టాలను సరలీక్షృతం చేయడం,, అస్పష్టతలను తొలగించడం, పన్ను చెల్లింపుదారుల సమ్మితని సులభతరం చేయడంపైనే దృష్టి సారిస్తుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రవేశ ఆదాయపు పన్నుకు సంబంధించిన ఒక్కో అంశానికి విభిన్న నిబంధనలు/షరతులు, వివరణలు ఉండవని ఇటీవలే కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే వెల్లడించారు. దీర్ఘ వాక్యాలు ఉండవన్నారు. ఏదో ఒక మార్గం మంచిది లేదా ఉత్తమమైందని పన్ను చెల్లింపుదారులకు సూచించేలా రాతలు ఉండవని ఆయన తేల్చి చెప్పారు. తటస్థంగా(న్యూట్రల్) రచనా శైలి ఉంటుందని తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 'ఆదాయపు పన్ను చట్టం-1961'లోని అంశాలనే స్పష్టంగా, సంక్షిప్తంగా, సరళమైన భాషలో, పునరావృతాలు లేకుండా రాయించారు. ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా సరళీకరించిన ఈ అంశాలే 'నూతన ఆదాయపు పన్ను బిల్లు'లో ఉంటాయి.

Next Story

Most Viewed