- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Mood of the Nation : జార్ఖండ్‌లో ఎన్డీయే కూటమి పాగా.. ‘ఇండియా టుడే’ ఒపీనియన్ పోల్ నివేదిక
దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్‌లోనూ ఈ ఏడాది చివరికల్లా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో నిర్వహించిన ‘ఇండియా టుడే - మూడ్ ఆఫ్ ది నేషన్’ ఒపీనియన్ పోల్ సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించబోతోందని సర్వేలో గుర్తించారు. ఇప్పటికిప్పుడు జార్ఖండ్‌లో మళ్లీ లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తే మొత్తం 14 లోక్‌సభ సీట్లకుగానూ 11 చోట్ల ఎన్డీయే కూటమి జయకేతనం ఎగురవేస్తుందని సర్వేలో వెల్లడైంది.
వాస్తవానికి ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 9 సీట్లే వచ్చాయి. అంటే మరో 2 లోక్‌సభ స్థానాలను పెంచుకునే స్థాయికి బీజేపీ పికప్ అయిందని సర్వే నివేదిక పేర్కొంది. ఇండియా కూటమి కేవలం 3 లోక్‌సభ సీట్లతో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని తెలిపింది. వీటిలో జేఎంఎంకు 2 సీట్లు, కాంగ్రెస్‌కు 1 సీటు రావచ్చని తెలిపింది. ఈ లెక్కన ప్రస్తుతం జార్ఖండ్‌లో అధికారంలో ఉన్న జేఎంఎం, కాంగ్రెస్ కూటమి మళ్లీ అధికారంలోకి రాదని సర్వే నివేదిక తేల్చింది.