- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు కరోనా పాజిటివ్
by Desk |

X
ముంబై: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సామాన్యుల నుంచి, సెలబ్రిటీల వరకు ఎవ్వరిని మహమ్మారి వదలట్లేదు. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ కరోనా బారిన పడ్డారు. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ట్వీట్ చేశారు. అయితే ఆందోళన పడాల్సిన అవసరం లేదని, వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు స్వీయ పరీక్ష చేసుకుని అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సీనియర్ కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మంత్రి శరద్ పవార్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.
Next Story