- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగాలాండ్‌లో మహిళ ప్రాతినిథ్యం ఈసారైనా దక్కేనా!
కోహిమా: మరికొన్ని రోజుల్లో నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మహిళ ప్రాధాన్యతపై రాష్ట్రంలో ఆసక్తి నెలకొంది. 1963లో రాష్ట్ర హోదా పొందిన తర్వాత ఇక్కడి నుంచి ఒక్క మహిళ కూడా రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు మహిళలు పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. ఈ నెల 27న జరిగే 14వ నాగాలాండ్ అసెంబ్లీ ఆయా పార్టీల తరుఫున నలుగురు బరిలోకి దిగుతున్నారు.
నేషనల్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ), భారతీయ జనతా పార్టీ(బీజేపీ), కాంగ్రెస్‌ల తరుఫున సల్హౌటుయోనువో క్రూస్, రోజీ థాంప్సన్, కహులీ సెమా, హెకాని జఖాలు బరిలో ఉన్నారు. వీరంతా కొత్త వారే కావడం గమనార్హం. వీరిలో 56 ఏళ్ల క్రూస్ పశ్చిమ అంగామీ నియోజకవర్గం నుంచి బరిలోకి ఎన్డీపీపీ తరుఫున దిగుతుంది. తన భర్త కెవిసెఖో క్రూజ్ మరణంతో సీటు ఆమెకు దక్కింది.
మరో నేత హెకాని జఖాలు కూడా ఎన్డీపీపీ తరుఫున దిమాపూర్-3 నుంచి పోటీ చేస్తొంది. కహులీ సెమా 32-అటోయిజు నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఇక రోజి థామస్ కాంగ్రెస్ పార్టీ తరుఫున 6-టెనింగ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. వీరిలో ఎవరు గెలిచిన నాగాలాండ్ అసెంబ్లీలో కొత్త చరిత్రను లిఖించిన వారు కానున్నారు. రాబోయే ఎన్నికల్లో 49.79శాతం ఓట్ల షేరింగ్ ను కలిగి ఉన్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే వారి శాతం మాత్రం 6.67 శాతంగానే ఉంది.