Mukesh Ambani : మహకుంభమేళాకు ముకేష్ అంబానీ కుటుంబం

by M.Rajitha |   ( Updated:2025-02-11 12:17:14.0  )
Mukesh Ambani : మహకుంభమేళాకు ముకేష్ అంబానీ కుటుంబం
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్(UP) ప్రయాగ్ రాజ్(Prayag Raj) లో మహాకుంభమేళా(Maha Kumbh Mela) ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. జనవరి 13న మొదలైన ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ఫిబ్రవరి 26న ముగియనుంది. కాగా ఈ మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 45 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్(UP) ప్రభుత్వం పేర్కొన్నది. రోజులు గడుస్తున్న కొద్దీ మరింత మంది భక్తులు పోటెత్తడంతో ప్రయాగ్ రాజ్ చేరుకునే రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసి పోయాయి. ప్రయాగ్ రాజ్ నుంచి దాదాపు 400 కిమీల మేర ట్రాఫిక్ జామ్(Traffic Jam) అయి ఎక్కడిక్కడ వాహనాలు నిలిచిపోయాయి అంటే అక్కడి జనసందోహం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రాఫిక్ ను అదుపులోకి తెచ్చేందుకు ప్రయాగ్ రాజ్ అధికారులు రాత్రీ పగలు తేడా లేకుండా శ్రమిస్తున్నారు.

తాజాగా అందిన సమాచారం ప్రకారం మహాకుంభమేళాకు భారత వ్యాపార దిగ్గజం, ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ(Mukesh Ambani) తన కుటుంబంతో సహ హాజరయ్యారు. కుటుంబంతో కలిసి త్రివేణి సంగమానికి ముఖేష్ చేరుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఇప్పటికే భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, ఆయా రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో జరుగుతున్న మహాకుంభమేళాలో పాల్గొన్నారు.

ఇక ప్రయాగ్ రాజ్ లో తీవ్రంగా పెరుగుతున్న భక్తుల రద్దీ, విపరీతమైన ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్(UP CM Yogi Aduthyanath) కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం సాయంత్రంలోగా కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికిల్ జోన్(No Vehicle Zone) గా మార్చివేయనున్నారు. వాహనాలను కుంభమేళా ప్రాంతం వరకు అనుమతించడం వలనే రద్దీ పెరుగుతోందని అధికారులు సీఎంకు నివేదించడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారు. కుంభమేళాకు ఉత్తర భారతదేశం నుంచే వచ్చే యాత్రికులు భారీ సంఖ్యలో ఉండటం.. పుణ్యస్నానాల అనంతరం వీరంతా కాశీ, అయోధ్యకు వెళుతుండటంతో.. ఆయా దారులన్నీ వాహనాలతో నిండిపోయి రోడ్లు బ్లాక్ అయ్యాయి. కేవలం 50 కిమీల దూరానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. మధ్యప్రదేశ్లోని అనేక జిల్లాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినప్పటికీ అవేవీ ట్రాఫిక్ సమస్యను తప్పించలేక పోయాయి. మరోవైపు ట్రాఫిక్ లో ఇరుకున్న యాత్రికుల కోసం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి తాగు నీరు, ఆహారం అందిస్తున్నాయి.

Next Story

Most Viewed