After Modi : మోడీ వార‌సుడు అమిత్ షా! యోగి ఆదిత్యనాథ్ ప్లేస్? కొత్త స‌ర్వేలో సంచలన విషయాలు

by Ramesh N |
After Modi : మోడీ వార‌సుడు అమిత్ షా! యోగి ఆదిత్యనాథ్ ప్లేస్? కొత్త స‌ర్వేలో సంచలన విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీలో ప్రధాని మోడీ తర్వాత ఎవరు? అనే ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే మోడీ తర్వాత ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనేదానిపై ఆగస్టు 2024 ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా ప్రధాని మోడీ తర్వాత ఆయన వారసుడిగా బాధ్యతలను చేపట్టడానికి బీజేపలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమర్ధులని సర్వేలో వెల్లడైంది. 25 శాతం మంది మద్దతుతో ఆయన ముందున్నట్లు తెలిపింది.

అమిత్ షా తర్వాత 19 శాతం మంది మద్దతుతో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో, 13 శాతంతో 3 వ స్థానంలో రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, 5 శాతం మద్దతుతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. గతంలో పోలిస్తే అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్‌కు కొంత మద్దతు తగ్గుముఖం పట్టినట్లు సర్వేలో తేలింది. అయితే రాజ్‌నాధ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్‌లు ప్రధాని మోడీకి సంభావ్య వారసులుగా ప్రజాదరణ పొందారని తెలిపారు.

Advertisement

Next Story