- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ చిల్డ్రన్ హాస్పిటల్ అగ్నిప్రమాదంపై స్పందించిన ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో: తూర్పు ఢిల్లీలోని ఓ పిల్లల ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించడంతో ఏడుగురు నవజాత శిశువులు మరణించారు. ఈ ఘటనపై దేశ ప్రధాని మోడీ స్పందించారు. "ఢిల్లీలోని ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదం హృదయ విదారకంగా ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను" అని ప్రధాని మోడీ ఎక్స్‌లో రాసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. శనివారం రాత్రి 11:30 గంటలకు బేబీ కేర్ న్యూ బోర్న్ హాస్పిటల్లో మంటలు చెలరేగాయి, వెంటనే పక్కనే ఉన్న మరో రెండు భవనాలకు మంటలు వ్యాపించాయి. దీంతో సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ
ప్రమాదంలో ఏడుగురు పిల్లలు మరణించగా, 5 మంది మరొక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షాట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆసుపత్రి యజమాని నవీన్ కిచ్చిగా గుర్తించారు, అతనిపై చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. పిల్లల ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర బాధాకరమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ ప్రమాదంలో తమ అమాయక పిల్లలను కోల్పోయిన వారికి మేమంతా అండగా ఉంటాం. ఘటనా స్థలంలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు, ఈ నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిని విడిచిపెట్టమని ఆయన తెలిపారు.