రేపు మిజోరం ఫలితాలు.. ఈశాన్య రాష్ట్ర త్రిముఖ పోరులో విజయం ఎవరిదో!

by Anjali |
రేపు మిజోరం ఫలితాలు.. ఈశాన్య రాష్ట్ర త్రిముఖ పోరులో విజయం ఎవరిదో!
X

ఐజోల్: ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. షెడ్యూలు ప్రకారం తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలతో పాటు ఆదివారమే ఫలితాలు రావాల్సి ఉంది. కానీ, క్రిస్టియన్ మెజారిటీ రాష్ట్రం కావడం, ఆదివారం కాకుండా మరొకరోజు ఓట్ల లెక్కింపు చేపట్టాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం లెక్కింపు తేదీని మార్చింది. ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య మొత్తం 13 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమవుతుందని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి హెచ్ లియాంజెలా చెప్పారు.

కాగా, రాష్ట్రంలోని 40 అసెంబ్లీ స్థానాల్లో నవంబర్ 7న పోలింగ్ జరిగింది. మొత్తం 8.57 లక్షల మంది ఓటర్లు ఉంటే, 80 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 18 మంది మహిళలతో కలిపి 174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రంలో అధికార ఎంఎన్ఎఫ్‌తో పాటు జెడ్‌పీఎం, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోరు నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌లో జెడ్‌పీఎం క్లీన్ స్వీప్ చేస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్‌ఎన్‌ఎఫ్ 26 సీట్లు గెలుచుకోగా, జెడ్‌పీఎం ఎనిమిది స్థానాల్లో గెలుపొందింది. ఐదు సీట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది. బీజేపీ ఒక్క సీటు గెలుచుకుంది.

Advertisement

Next Story

Most Viewed