- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mission Rhumi : 24న భారత్ తొలి రీయూజబుల్ రాకెట్ ప్రయోగం
దిశ, నేషనల్ బ్యూరో : రాకెట్ల తయారీలో భారత్ మరో ముందడుగు వేయబోతోంది. తొలి స్వదేశీ రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ ‘రుమి 1’ను శనివారం (ఆగస్టు 24న) ప్రయోగించబోతోంది. దీన్ని తమిళనాడు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే స్టార్టప్ ‘స్పేస్ జోన్ ఇండియా’ అభివృద్ధి చేసింది. ఈనెల 24న ఉదయం 7 గంటలకు చెన్నైలోని తిరువిదంధై తీర ప్రాంతంలో ఒక భారీ వాహనంలో నుంచి ‘రుమి 1’ రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఈ రాకెట్‌లో 3 క్యూబ్ శాటిలైట్లు, 50 పీఐసీఓ శాటిలైట్లు ఉంటాయి. వీటిని నిర్ణీత అంతరిక్ష కక్ష్యలో వదిలేసి రాకెట్ భూమికి తిరిగి వచ్చేస్తుంది.
ఇలా భూమికి తిరిగి వచ్చే రాకెట్‌కు చిన్నపాటి మరమ్మతులు, అప్‌గ్రేడ్ చేసుకొని మళ్లీ ప్రయోగాలకు వాడుకోవచ్చు. అందుకే వీటిని రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్లు అని పిలుస్తారు. స్పేస్ జోన్ ఇండియా, మార్టిన్ గ్రూపు సంయుక్తంగా ఈ రాకెట్‌ను అభివృద్ధిపర్చాయి. ఈ రాకెట్ల సిరీస్‌లో రుమి -1, రుమి-2, రుమి-3 పేర్లతో మరిన్ని వేరియంట్ల రాకెట్లు లభిస్తాయి. 1 కిలోమీటరు నుంచి మొదలుకొని 500 కి.మీ దాకా అంతరిక్ష కక్ష్య రేంజ్‌లో శాటిలైట్లను మోహరించగల సామర్థ్యం రుమి సిరీస్ రాకెట్లకు ఉందని సమాచారం.