'లక్షన్నర మంది మహిళలు, బాలికలు మిస్సయ్యారు'.. బీజేపీ సర్కారుపై ప్రియాంకా గాంధీ ఫైర్

by Vinod kumar |   ( Updated:2023-10-12 14:27:00.0  )
Priyanka Gandhi Tests Corona Positive
X

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ ఫైర్ అయ్యారు. కాషాయ పార్టీ పాలనలో రాష్ట్రంలో 1.5 లక్షల మంది మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారని ఆమె ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో గత 18 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వమున్నా.. ఉపాధి అవకాశాల్లేక ప్రజలు పొట్ట చేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. గురువారం మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలో జరిగిన ‘జన్ ఆక్రోశ్’ ర్యాలీలో ప్రియాంకాగాంధీ ప్రసంగించారు.

‘‘రాష్ట్రంలో రోజూ 17 అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. ఆదివాసీలపై అఘాయిత్యాల విషయంలో మధ్యప్రదేశ్‌ దేశంలోనే మొదటిస్థానంలో ఉంది’’ అని ఆమె విమర్శలు గుప్పించారు. ‘‘రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక సర్పంచుల హక్కులను తగ్గించింది. ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయకపోవడంతో వలసలు పెరిగాయి. పేదల భూముల కబ్జాలు పెరిగిపోయాయి. రైతుల పంటలకు సరైన ధర ఇవ్వడం లేదు. నిరసన తెలిపితే బుల్లెట్లతో ఆన్సర్ ఇస్తున్నారు’’ అని ప్రియాంక పేర్కొన్నారు.

Advertisement

Next Story