Dominican Beach: డొమినికన్ బీచ్ లో తప్పిపోయిన విద్యార్థి దుస్తులు లభ్యం

by Shamantha N |
Dominican Beach: డొమినికన్ బీచ్ లో తప్పిపోయిన విద్యార్థి దుస్తులు లభ్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: డొమినికన్‌ రిపబ్లిక్‌లో (Dominican Republic) అదృశ్యమైన భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోనంకి (Sudiksha Konanki) మిస్టరీ కేసులో ట్విస్ట్ బయటపడింది. ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులకు సుదీక్ష దుస్తులు, చెప్పులు బీచ్ వద్దనున్న లాంజ్ కుర్చీలో ఉన్నట్లు తేలింది. దీనికి సంబంధించిన కొన్ని విజువల్స్ బయటపడ్డాయి. సుదీక్ష దుస్తులు కొన్ని మట్టిలో కూరుపోయినట్లు గుర్తించారు. ఆమె నీటిలోకి వెళ్లే ముందు వాటిని అక్కడ వదిలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇకపోతే, వర్జీనియాకు చెందిన 20 ఏళ్ల సుదీక్ష ఇటీవల మరో ఐదుగురు అమ్మాయిలతో కలిసి డొమినికన్‌ రిపబ్లిక్‌లోని ప్రముఖ పర్యటక పట్టణమైన ప్యూంటా కానా ప్రాంతానికి వెకేషన్‌కు వెళ్లింది. మార్చి 6న స్థానికంగా ఉన్న రియూ రిపబ్లికా రిసార్ట్‌ బీచ్‌ వద్ద చివరిసారిగా కన్పించింది. ఆ తర్వాత ఆమె గదికి తిరిగి రాకపోవడంతో స్నేహితులు పోలీసులను సంప్రదించారు. అప్పట్నుంచే ఆమె కోసం గాలిస్తున్నారు.

స్టూడెంట్ మిస్సింగ్

మార్చి 6 తెల్లవారుజామున 3 గంటలకు పార్టీ చేసుకున్న తర్వాత ఐయోవాకు చెందిన 24 ఏళ్ల టూరిస్టు జాషువా స్టీవెన్ రిబెతో కలిసి బీచ్ కు వెళ్లినట్లు తేలింది. అయితే రిబెను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు. మరోవైపు, సుదీక్షను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో ఆమె దుస్తులు బీచ్ వద్ద కన్పించడం కలకలం రేపింది. అంతేకాకుండా, చివరిసారిగా తప్పిపోయిన దగ్గర సముద్రాన్ని స్కాన్ చేయడానికి అధికారులు డ్రోన్‌లు, ఏఐ అసిస్టెడ్ సర్విలెన్స్ ని మోహిరంచారు. సుదీక్ష కోసం ఇంటర్ పోల్ ఎల్లో నోటీసు జారీ చేసింది. దర్యాప్తులో ఎఫ్ బీఐ, డీఈఏ, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీతో కలిసి పనిచేస్తున్నామని పిట్స్ బర్గ్ యూనివర్సిటీ తెలిపింది.

Next Story

Most Viewed