- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీఎం-కిసాన్ సాయం రూ.8,000-12,000 పెంపుపై కీలక ప్రకటన
దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల పీఎం-కిసాన్ పథకం కింద లబ్ధిదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని పెంచునున్నారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా కీలక ప్రకటన చేశారు. పీఎం-కిసాన్ పథకం కింద రైతులకు ఆర్థిక ప్రయోజనాన్ని ఏడాదికి రూ.8,000-12,000కు పెంచే ప్రతిపాదన లేదని మంత్రి లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. అలాగే, ఈ పథకం కింద మహిళా రైతులకు కూడా పెంచే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని ఆయన అన్నారు.
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్)ని కేంద్రం 2019లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా ప్రతి ఏడాది రూ.6000 అందిస్తారు. వీటిని విడతల వారీగా ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున రైతుల అకౌంట్లలో జమ చేస్తారు.
మంత్రి లోక్‌సభలో పేర్కొన్న దాని ప్రకారం ,ప్రభుత్వం ఇప్పటివరకు 15 విడతలుగా 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ.2.81 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే, ప్రపంచంలోని అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పథకాల్లో ఇది ఒకటని, ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నట్లు మంత్రి అన్నారు.