- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: 48 గంటల పాటు అతిభారీ వర్షాలు
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పూండి, చెంబరబాక్కం రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయాయి. జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. చెన్నై, మదురై,సేలం సహా 10 జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయని తెలిపారు. మరో 48 గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. దీంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జలపాతాల వైపు పర్యాటకులకు అనుమతి నిషేధించారు.
వర్షాల నేపథ్యంలో ప్రజలకు అప్రమత్తత జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపారు. రోడ్లపై నీరు నిలిచిపోయే అవకాశం ఉండటంతో వాహనాలను స్లోగా డ్రైవర్ చేయాలని చెప్పారు. ప్రైవేటు ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించారు. రైతులు పొలం పనులు వాయిదా వేసుకోవాలని, చెట్ల కిందకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.