Mayawati : బీఎస్పీ సీనియర్ నేతపై బహిష్కరణ వేటు .. షాకింగ్ కారణం

by Hajipasha |
Mayawati  : బీఎస్పీ సీనియర్ నేతపై బహిష్కరణ వేటు .. షాకింగ్ కారణం
X

దిశ, నేషనల్ బ్యూరో : బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి(Mayawati) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సురేంద్ర సాగర్‌‌ను బీఎస్పీ నుంచి బహిష్కరించారు. గతంలో బీఎస్‌పీ నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచిన త్రిభువన్ దత్ ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ(SP) ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అంబేద్కర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. త్రిభువన్ దత్ కూతురితో బీఎస్పీ నేత సురేంద్ర సాగర్‌‌ కుమారుడు అంకుర్‌కు ఇటీవలే పెళ్లి జరిగింది.

ఈవిషయం తెలియడంతో సురేంద్ర సాగర్‌‌ను బీఎస్పీ నుంచి బహిష్కరిస్తూ మాయావతి ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, క్రమశిక్షణా నియమావళి ఉల్లంఘన వల్లే సురేంద్రపై బహిష్కరణ వేటు వేశారని బీఎస్పీ వర్గాలు చెబుతున్నాయి. సురేంద్ర సాగర్ మాత్రం తాను బీఎస్పీ నియమావళి ప్రకారమే నడుచుకున్నానని చెబుతున్నారు. సమాజ్‌వాదీ ఎమ్మెల్యే కూతురితో తన కొడుకుకు పెళ్లి చేసినందు వల్లే తనపై చర్యలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు.

Next Story