- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
బంగ్లాలో రాజకీయ గందరగోళం.. మాజీ క్రికెటర్ మష్రాఫ్ మోర్తాజా ఇంటికి నిప్పు
దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి వైదొలిగినప్పటి నుంచి దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆందోళన కారులు రెచ్చిపోతున్నారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఇంట్లో చొరబడి.. చేతికందని వస్తువులను దోచుకెళ్లారు. దీంతో ఆ దేశంలో ప్రస్తుతం సైనిక పాలన కొనసాగుతుంది. అయినప్పటికి హింస, అలర్లు ఆగడం లేదు. బంగ్లాదేశ్‌లో విస్తృతమైన రాజకీయ అశాంతి మధ్య బంగ్లాదేశ్ క్రికెట్ మాజీ కెప్టెన్ మష్రఫ్ మోర్తజా ఇంటికి నిప్పు పెట్టారు. గంట గంటకు దేశంలో అస్థిర పరిస్థితిని మరింత పెరుగుతుంది. గత 30 ఏళ్లలో 20 సంవత్సరాలు దేశానికి నాయకత్వం వహించిన హసీనా, విస్తృతమైన విద్యార్థుల నిరసనలు, దేశంలోని వివిధ వర్గాల నుంచి పెరుగుతున్న ఒత్తిడి మధ్య రాజీనామా చేశారు. నిరసనకారులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, గణనీయమైన రాజకీయ మార్పులను కోరుతూ వీధుల్లోకి రావడంతో అశాంతి తారాస్థాయికి చేరుకుంది.