Manipur: మణిపూర్‌కు మరో 20 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు.. హింస నేపథ్యంలో కేంద్రం నిర్ణయం

by vinod kumar |
Manipur: మణిపూర్‌కు మరో 20 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు.. హింస నేపథ్యంలో కేంద్రం నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌(Manipur)లో తాజాగా నెలకొన్న హింస వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2000 మంది సిబ్బందితో కూడిన సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) బలగాలను రాష్ట్రానికి తరలించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే విమానం ద్వారా వీరందరిని రాష్ట్రాలనికి పంపించాలని తెలిపింది. 20 సీఏపీఎఫ్ కంపెనీలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) 15, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కు చెందిన 5 బలగాలు ఉన్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ యూనిట్లన్ని ఈ నెల 30 వరకు మణిపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండనున్నట్టు తెలుస్తోంది.

కాగా, గతేడాది మేలో రాష్ట్రంలో చెలరేగిన హింస తర్వాత రాష్ట్రంలో 198 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు మోహరించింది. దీంతో తాజా బలగాలు వాటితో జతకట్టనున్నాయి. అయితే ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్‌లో 11 మంది కుకీ మిలిటెంట్ల(Kukee militants)ను భద్రతా బలగాలు హతమార్చాయి. అనంతరం రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు వ్యక్తులు అదృశ్యం కాగా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం భారీగా బలగాలను తరలించింది.

Advertisement

Next Story

Most Viewed