- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పంచాయతీ పోల్స్లో కేంద్ర బలగాల మోహరింపు.. సుప్రీంకు మమత సర్కార్
కోల్‌కతా : పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలంటూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) సంయుక్తంగా శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కోసం 48 గంటల్లోగా కేంద్ర బలగాలను మోహరించేలా చూడాలంటూ కోల్‌కతా హైకోర్టు గత బుధవారమే ఎస్ఈసీకి ఆదేశాలిచ్చింది. పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో హింస చెలరేగడాన్ని హైకోర్టు ప్రస్తావిస్తూ, జూన్ 13న తాము ఆదేశాలు ఇచ్చినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని పేర్కొంది.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కేంద్ర బలగాలను మోహరించేలా తగిన ఆదేశాలివ్వాలంటూ బీజేపీ నేతలు సువేందు అధికారి, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి హైకోర్టును ఇంతకుముందు ఆశ్రయించారు. దీంతో కేంద్ర బలగాలను మోహరించేలా చూడాలంటూ హైకోర్టు జూన్ 14న ఆర్డర్స్ ఇచ్చింది. కాగా, పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికలు జూలై 8న ఒకే విడతలో జరుగనున్నాయి.