- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Kolkata Rape- Murder Case: డబ్బు ఇవ్వజూపామన్న వార్తలన్నీ అవాస్తవాలే- మమతా బెనర్జీ
దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం(Kolkata Doctor Rape and Murder) కేసులో వస్తున్న వార్తలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) స్పందించారు. అవన్నీ అవాస్తవాలని.. అసత్య ప్రచారమని అన్నారు. బాధితురాలి తల్లిదండ్రులకు పోలీసులు డబ్బు ఆశ చూపినట్లు ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోపైనే.. దీదీ స్పందించారు. బాధితురాలి తల్లిదండ్రులకు పోలీసులు డబ్బు ఇవ్వలేదని స్పష్ట చేశారు. తమ ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ఆరోపణలని అన్నారు. ‘నేను బాధితురాలి తల్లిదండ్రులకు ఎలాంటి డబ్బు ఇవ్వలేదు. ఇవన్నీ అసత్య ఆరోపణలే. డబ్బు పరిహారం కాదని.. బాధితురాలి తల్లిదండులకు మాత్రం ఓ విషయం చెప్పాను. తమ కూతురి జ్ఞాపకార్థం ఏదైనా చేయాలనుకుంటే మా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చా. ఆర్జీ కర్ ఆస్పత్రిలో నిరసనల తర్వాత రాజీనామా చేస్తానని కోల్‌కతా సీపీ(Kolkata Commissioner of Police) వినీత్ గోయల్ అన్నారు. కానీ, దుర్గాపూజకు ముందు శాంతిభద్రతలు తెలిసినవారే సీపీగా ఉండాలి. అందుకే ఆయన సీపీగా కొనసాగుతున్నారు. మా ప్రభుత్వంపై కేంద్ర కుట్ర చేస్తుంది. ఇందులో వామపక్షాలు కూడా పాలుపంచుకుంటున్నాయి.’’ అని అన్నారు కోల్ కతా ట్రైనీ డాక్టర్ పేరెంట్స్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. అందులో, సీనియర్ పోలీసు అధికారి తమ వద్దకు వచ్చి డబ్బులు ఆఫర్ చేశారని.. దాన్ని వారు తిరస్కరించినట్లు ఉంది. ఈ వార్తలపైనే దీదీ స్పందించారు.