Sanjay Raut: మోడీ పర్యటనపై శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ విమర్శలు

by Shamantha N |
Sanjay Raut: మోడీ పర్యటనపై శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీపై శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్(Sanjay Raut) తీవ్ర విమర్శలు గుప్పించారు. మోడీ చేసిన ‘ఏక్ హై తో సేఫ్ హై’(మనం ఐక్యంగా ఉంటే సురక్షితం) నినాదంపై ఆయన విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర(Maharashtra) ఇప్పటికే చాలా సురక్షితమైన రాష్ట్రమని ఆయన చెప్పుకొచ్చారు. కానీ, మోడీ రాష్ట్రాన్ని సందర్శించినప్పుడల్లా అస్థిరతకు గురువుతుందని మండిపడ్డారు. విభజనలు సృష్టించి అశాంతిని రెచ్చగొట్టే ప్రయత్నాలతోనే మోడీ(PM Modi) పర్యటనలు జరుగుతున్నాయని సంజయ్ రౌత్(Shiv Sena (UBT)) ఆరోపణలు చేశారు. ‘‘ప్రధాని మోడీ ఎందుకు ఇలాంటి భాష వాడుతున్నారో అర్థం కావడం లేదు. మహారాష్ట్రలో ప్రజలు ఇప్పటికే సురక్షితంగా ఉన్నారు. కానీ మోడీ ఎప్పుడు పర్యటించినా.. విభజన రాజకీయాలు, అశాంతిని రెచ్చగొట్టడం వల్లే రాష్ట్రం అభద్రతకు గురవుతోంది. రాష్ట్రానికి నిజంగా భద్రత కావాలంటే.. మేం బీజేపీని ఓడించాలి’’ అని అన్నారు.

మోడీ ఏమన్నారంటే?

కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కులరాజకీయాలు చేస్తున్నాయని ప్రధాని మోడీ ఆరోపించారు. ‘ఏక్ హై, తో సేఫ్ హై’(ఐక్యంగా ఉంటేనే సురక్షింతంగా ఉంటాం) అని ప్రజలు ఐక్యంగా ఉండాలని కోరారు. ‘‘ కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎజెండా ఒక కులాన్ని మరో కులానికి వ్యతిరేకంగా ఉంచటం. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు అభివృద్ధి చెందడం,వారికి తగిన గుర్తింపు రావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. మనం ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం గుర్తుపెట్టుకోండి’’ అని ధూలేలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ మోడీ అన్నారు. ఇక.. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగనుంది.

Advertisement

Next Story