- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
9వ తరగతి విద్యార్థులకు డేటింగ్, రిలేషన్స్ పై పాఠాలు..! తర్వాత ఆ చాప్టర్ కూడా..
దిశ, డైనమిక్ బ్యూరో: 9వ తరగతి విద్యార్థులకు డేటింగ్, రిలేషన్స్ పై సీబీఎస్‌ఈ పాఠాలు బోదిస్తుంది. టీనేజీ పిల్లలకు డేటింగ్, రిలేషన్స్‌పై పాఠాలు ఉండటంపై తాజాగా సోషల్ మీడియాలో చర్చానీయాంశంగా మారింది. ఇలాంటి పాఠాలు కూడా ఉన్నాయా? అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. టీనేజ్‌లో చిగురించే ప్రేమ ఆ సమయంలో ఏర్పడే రిలేషన్స్ ఆ వయసు లోని వారిని గందరగోళంలోకి పడేస్తాయి.ఈ క్రమంలో సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
నెక్ట్స్ చాప్టర్ లో బ్రేకప్స్!
9వ తరగతి పాఠ్య పుస్తకాల్లో డేటింగ్, రిలేషన్స్‌కి సంబంధించిన చాప్టర్లను ప్రవేశపెట్టింది. ఇందులో అట్రాక్షన్, క్రష్‌లు, ప్రత్యేక స్నేహాలు వంటి అంశాలు ఈ డేటింగ్ అండ్ రిలేషన్ షిప్స్ పాఠంలో ఉన్నాయి. దీనిపై ప్రముఖ డేటింగ్ యాప్ టిండర్ ఇండియా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘నెక్ట్స్ చాప్టర్ లో బ్రేకప్స్ ని ఎలా ఎదుర్కోవాలి..?’ అనే చాప్టర్ అందించాలని సూచించింది. మరోవైపు బ్రెకప్‌కు సంబంధించిన పాఠాలు 10 వ తరగతిలో ఉంటాయని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.