- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హత్య కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష.. లోక్‌సభ సభ్యత్వం రద్దు
X
న్యూఢిల్లీ: లక్షదీప్‌కు చెందిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహ్మద్ ఫైజల్‌కు షాక్ ఎదురైంది. తాజాగా హత్య కేసులో 10 ఏళ్ల శిక్ష ఖరారు కావడంతో లోక్ సభ సెక్రటేరియట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. శిక్ష పడిన రోజు నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. 2009లో నమోదైన హత్యాయత్నం కేసులో మరో ముగ్గురికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడింది. కవరత్తిలోని జిల్లా సెషన్స్ కోర్టు ఎంపీతో పాటు ఇతర నిందితుల బెయిల్‌ను సస్పెండ్ చేసింది. వారిని కేరళలోని కన్నూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. కేంద్ర పాలిత ప్రాంతంలో 2014 నుంచి ఆయన ఎంపీగా కొనసాగుతున్నారు. తన బంధువు మహ్మద్ సాలిహ్ హత్య కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Advertisement
Next Story