Kolkata doctor rape-murder: ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ కు పాలీగ్రాఫ్ పరీక్ష?

by Shamantha N |
Kolkata doctor rape-murder: ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ కు పాలీగ్రాఫ్ పరీక్ష?
X

దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతా హత్యాచార ఘటనలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. డాక్టర్ సందీప్ ఘోష్ కు పాలిగ్రాఫ్ పరీక్ష చేయాలని సీబీఐ ఆలోచిస్తోంది. విచారణలో పొంతనలేని సమాధానలు చెప్తున్నట్లు సీబీఐ పేర్కొంది. ఆయన చెప్పే సమాధానాల్లో "వ్యత్యాసాలు" ఉన్నట్లు ఏజెన్సీ గుర్తించింది.దీంతో, లై-డిటెక్టర్ పరీక్ష నిర్వహించనున్నట్లు సీబీఐ అధికారి తెలిపారు. సంజయ్ రాయ్‌ కి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు ఇటీవలే సీబీఐ స్థానిక కోర్టు నుంచి అనుమతి పొందింది. కుట్రలో భాగంగానే డాక్టర్‌ను హత్య చేశారా అని తెలుసుకోవడానికి సీబీఐ గత మూడ్రోజులుగా మాజీ ప్రిన్సిపల్ ని సీబీఐ ప్రశ్నిస్తోంది.

ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ అవినీతి భాగోతం

ఆర్జీకర్ మెడికల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆయన భారీగా అవినీతి చేశారని తెలుస్తోంది. చివరికి వాడేసిన సిరంజులు, ఇతర సామగ్రిని కూడా రీసైక్లింగ్‌ చేసి సొమ్ము చేసుకొనేవాడని తెలిసింది. గతేడాది వరకు ఇదే కళాశాలలో పనిచేసిన మరో డాక్టర్ అక్తర్ అలీ ఈ విషయంపై గతంలోనే అధికారులకు ఫిర్యాదులు చేశారు. ప్రస్తుతం ముర్షిదాబాద్‌ మెడికల్ కాలేజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ గా ఉన్న అక్తర్ అలీ గతంలో అవినీతి ఆరోపణలపై అధికారులకు చెప్పారు. అయితే, ఈ ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అక్తర్‌ను విచారణకు పిలిపించింది. ఆయన ఫిర్యాదుల ఆధారంగా సందీప్ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ‘వాడిన సిరంజ్‌లు, సెలైన్‌ బాటిల్స్‌, రబ్బర్‌ గ్లౌజులు వంటివి ఆసుపత్రిలో ప్రతీ రెండ్రోజులకు 500-600 కిలోలు పోగయ్యేవి. వాటిని ఇద్దరు బంగ్లాదేశీల సాయంతో రీసైక్లింగ్‌ చేయించేవాడు’అని ఆరోపించారు. వీటిపై అలీ అప్పట్లోనే విజిలెన్స్‌ కమిషన్‌, ఏసీబీ, హెల్త్‌ డిపార్ట్‌మెంట్లకు ఫిర్యాదు చేశాడు.

ఉన్నతాధికారులకు లేఖ రాసిన అలీ

ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడటమే కాకుండా.. బయోమెడికల్‌ వ్యర్థాలు, వైద్య సామాగ్రిని కూడా ఇతర దేశాలకు రవాణా చేసేవాడని అక్టర్ అలీ ఆరోపించారు. అనాథ శవాలతో వ్యాపారం చేసేవాడని పేర్కొన్నారు. క్లెయిమ్ చేయని మృతదేహాలను విక్రయించడం సహా అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 2023 జులై 14న అక్తర్ అలీ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ‘హాస్పిటల్ ఆస్తులను కాలేజీ కౌన్సిల్ లేదా స్వాస్త్ భవన్ అనుమతులు లేకుండానే లీజుకు ఇచ్చేవాడు. ఇక వైద్యశాలకు అవసరమైన పరికరాలు, ఔషధాల సరఫరాదారుల ఎంపికలో బంధుప్రీతి చూపించాడు. కోట్ల రూపాయల విలువైన కొటేషన్ల విషయంలో కుమ్మక్కై అనర్హులకు ఇచ్చాడు. ఇక సరఫరాదారుల నుంచి 20శాతం కమిషన్‌ పుచ్చుకొనేవాడు’ అని అలీ ఆరోపించాడు. దీంతోపాటు పరీక్షలు తప్పిన విద్యార్థుల నుంచి కూడా సొమ్ములు దండుకొనేవాడని ఆరోపణలున్నాయి.

Advertisement

Next Story

Most Viewed