Kiran Kumar Reddy: మహారాష్ట్రలో విచిత్ర రాజకీయాలకు చెక్ పెట్టాలి

by Gantepaka Srikanth |
Kiran Kumar Reddy: మహారాష్ట్రలో విచిత్ర రాజకీయాలకు చెక్ పెట్టాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్రలో బీజేపీ(BJP)ని పాతరేయాలని ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో విచిత్ర రాజకీయాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉన్నదని కోరారు. ఆదివారం ఆయన చంద్రపూర్ జిల్లాలో కాంగ్రెస్(Congress) పార్టీ గ్యారంటీ కార్డులను విడుదల చేశారు. అనంతరం ఎంపీ చామల మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తోనే ప్రజాస్వామ్యానికి రక్షణ ఉన్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల తీర్పును పట్టించుకోదన్నారు. గతంలో పవర్ కోసం పొత్తులు, ప్రభుత్వాల కూల్చివేతలు వంటివి జరిగాయన్నారు. ప్రజాభిప్రాయం, నిర్ణయాలను పరిగణలోకి తీసుకోకుండా ముందుకు వెళ్లాయన్నారు. అందుకే ఈ సారి కాంగ్రెస్ కూటమిని గెలిపించాలన్నారు. పేదలు, సామాన్యులకు గౌరవం లభిస్తుందన్నారు. బీజేపీ మతం, కులం పేరిట రాజకీయాలను విషతుల్యం చేసిందన్నారు. గడిచిన పదేళ్లుగా ప్రజాస్వామ్యం వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed