- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీఎం అయితే అరెస్ట్ చేయొద్దా?.. కోర్టులో ఈడీ కీలక వాదన

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. మరో నాలుగు రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన ఏడు రోజుల కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో ఈడీ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా మరో ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. నాలుగు రోజుల కస్టడీకి ఇస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఈడీ తరపు న్యాయవాది కోర్టులో కీలక వాదనలు చేశారు. విచారణలో కేజ్రీవాల్ తప్పించుకునే సమాధానాలు చెబుతున్నారని అన్నారు.
మద్యం కుంభకోణానికి బీజేపీకి ఇచ్చిన డబ్బులకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఎవరైనా ఏ వ్యక్తికి డబ్బులు చెల్లించినా తమకు సంబంధం లేదని అన్నారు. గోవా నుంచి పిలిపించిన కొందరితో కలిపి కేజ్రీవాల్‌ను ప్రశ్నించాల్సి ఉందని చెప్పారు. విచారణకు ఉద్దేశపూర్వకంగా కేజ్రీవాల్ సహకరించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సీఎం అయినంత మాత్రాన అరెస్ట్ చేయకూడదా? అని ప్రశ్నించారు. అనుకూలంగా ఉన్న పేజీలు ఈడీ వద్ద ఉన్నాయని కేజ్రీవాల్‌కు ఎలా తెలుసని అడిగారు. సౌత్ గ్రూపు నుంచి గోవా ఎన్నికలకు హవాలా ద్వారా రూ.100 కోట్లు ఇచ్చారని వాదించారు. కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా దర్యాప్తు సంస్థలపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.