కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే ఆ పండ్లు తింటున్నారు: ఈడీ సంచలన ఆరోపణలు

by samatah |   ( Updated:2024-04-18 15:27:11.0  )
కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే ఆ పండ్లు తింటున్నారు: ఈడీ సంచలన ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది. తిహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే మామిడిపండ్లు, స్వీట్లు, చక్కెరతో కూడిన టీ తాగుతున్నారని ఈడీ ఢిల్లీ కోర్టుకు తెలిపింది. షుగర్ లెవల్స్ పెంచుకోవడానికే ఇలా చేస్తున్నాడని, తద్వారా బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నాడని పేర్కొంది. తన షుగర్ లెవల్స్‌ను నిరంతరం పర్యవేక్షించాలని, వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతించాలని కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు గురువారం విచారణ చేపట్టగా..ఈడీ తన వాదనలు వినిపించింది. కేజ్రీవాల్‌కు షుగర్ ఉన్నప్పటికీ వాటిని తింటున్నారని వెల్లడించింది. దీంతో కేజ్రీవాల్ డైట్ పై నివేదికను అందజేయాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన కేజ్రీవాల్ తిహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 13వరకు ఆయనకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మరోవైపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యేలు, కేబినెట్ మంత్రులతో సమావేశాలు నిర్వహించేందుకు కేజ్రీవాల్‌ను అనుమతించాలని, ఈ మేరకు జైళ్ల డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

Advertisement

Next Story

Most Viewed