- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే: ఫరూక్ అబ్దుల్లా
దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా 'కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని ' అన్నారు. ఆదివారం బెంగళూరులో జరిగిన 'రాజ్యాంగం, జాతీయ ఐక్యత సమావేశం-2024' కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. ఈవీఎంలపై ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలకు ఎటువంటి సందేహాలు లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. అలాగే.. 'కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. ఎప్పటికీ అది భారత్‌లో భాగంగానే ఉంటుంది. అయినప్పటికీ దేశ వైవిధ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అందుకే కశ్మీర్‌ని రక్షించుకోవాలి. మతం మనల్ని విభజించదు, ఏకం చేస్తుంది. మనం ముందుకెళ్లాలంటే, దేశం ఎదుర్కొనే సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవడమే కాకుండా ఒకరినొకరు అండగా నిలబడటం ఒక్కటే మార్గమని, మనల్ని విభజించాలని భావించే శక్తులతో పోరాడాలని' ఆయన వెల్లడించారు. నేడు ప్రజాస్వామ్యం ముప్పును ఎదుర్కొంటోంది. దాన్ని పటిష్టంగా ఉంచేందుకు అందరూ కృషి చేయాలి. దీన్ని విస్మరిస్తే భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి ఉంటుందని పేర్కొన్నారు.