- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోలీ పండుగ పై ప్రభుత్వం కఠిన ఆంక్షలు
దిశ, వెబ్‌డెస్క్: హిందువుల పండుగ అయిన హోలీ పై కర్ణాటక ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. రాష్ట్రంలో త్వరలో జరగబోయే హోలీ వేడుకల్లో నీటిని వాడటం పూర్తిగా నిషేదించింది. అలాగే.. హోలీ సందర్భంగా పూల్ పార్టీలు, రెయిన్ డ్యాన్స్ లపై కూడా నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే హోలీ వేడుకలు ఇళ్లలోని బోర్ వెల్ నీళ్లను కూడా ఉపయోగించవద్దని ఆదేశించింది. అయితే గత నెలరోజులుగా కర్ణాటకలో నీటి సమస్య తాండవం చేస్తున్న క్రమంలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది.
కేవలం హిందువుల పండుగ అయిన హోలీ పై ఆంక్షలు ఏంటంటూ.. హిందూ సంఘాలు కర్ణాటక ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కర్ణాటకలో రోజుకి 500 మిలియన్ లీటర్ల నీటి కొరత ఉందని, త్వరలో జరగబోయే ఐపీఎల్ మ్యాచులకు కూడా నీటి కష్టాలు ఉన్నాయని.. మ్యాచ్ నిర్వాహణకు స్టేడియాన్ని తడిపేందుకు, శుద్ధిచేసిన మురికి నీటిని వాడాలని అధికారులు నిర్ణయించారు. కాగా స్టేడియంలో శుద్ధి చేసిన మురికి నీరు వాడటంతో క్రికెట్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది.