- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Kanojia: పోలీసుల పొరపాటుతో నా జీవితం నాశనం.. సైఫ్ కేసులో అనుమానితుడు ఆకాశ్ కనోజియా

దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే. అనంతరం రెండు రోజుల తర్వాత ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తూ అకాశ్ కనోజియా (Aakash kanojia) అనే డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారణ చేపట్టి ఆయన అసలు నిందితుడు కాదని తేలడంతో విడిచిపెట్టారు. ఈ పరిణామం జరిగిన తర్వాత తన జీవితం నాశమైందని కనోజియా ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబం ఎన్నోఅవమానాలు ఎదుర్కొందని, ఉద్యోగం పోవడంతో పాటు పెళ్లి కూడా ఆగిపోయిందని తెలిపారు. ‘మీడియా నా పొటోలను చూపించి ఈ కేసులో నేనే ప్రధాన నిందితుడినని ప్రచారం చేసింది. దీంతో నా కుటుంబం షాక్‌కు గురై కన్నీళ్లు పెట్టుకుంది. సీసీటీవీలో ఉన్న వ్యక్తిని పోలీసులు గమనించలేకపోయారు. తనకు మీసాలు ఉన్నాయని, సీసీ పుటేజీలో కనిపించిన వ్యక్తికి లేవు. ఈ విషయాన్ని గుర్తించకపోవడం దారుణం’ అని తెలిపారు. ముంబై పోలీసులు చేసిన ఒక పొరపాటు నా జీవితాన్ని అస్తవ్యస్తం చేసిందన్నారు.
‘నేను నా యజమానికి కాల్ చేసినప్పుడు, అతను నన్ను పనికి రావొద్దని చెప్పాడు. నా వివరణను వినడానికి కూడా ఆయన నిరాకరించాడు. నన్ను అరెస్ట్ చేసిన తర్వాత నా కాబోయే వధువు కుటుంబం పెళ్లిపై చర్చలు జరపడానికి నిరాకరించింది’ అని తెలిపారు. పోలీసుల పొరపాటు తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసిందని వాపోయాడు. కాగా, సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన తర్వాత దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానితుడిని గుర్తించారు. ఈ క్రమంలోనే ముంబై నుంచి కోల్ కతా వెళ్తున్న జ్ఞానేశ్వరి ఎక్స్ ప్రెస్‌లో కనోజియా ప్రయాణిస్తుండగా ముంబై పోలీసుల సూచన మేరకు దుర్గ్ స్టేషన్‌లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆయనను అదుపులోకి తీసుకుంది. అనంతరం అసలు నిందితుడు షరిఫుల్ ఇస్లామ్ అని తెలియడంతో కనోజియాను విడిచిపెట్టారు.