Prashant Kishore : దోనీ సీఎస్కేను గెలిపించినట్లు..నేను టీవీకేను గెలిపిస్తా : ప్రశాంత్ కిషోర్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-02-26 11:41:01.0  )
Prashant Kishore : దోనీ సీఎస్కేను గెలిపించినట్లు..నేను టీవీకేను గెలిపిస్తా : ప్రశాంత్ కిషోర్
X

దిశ, వెబ్ డెస్క్ : క్రికెట్ మహేంద్రసింగ్ ధోనీ చైన్నై సూపర్ కింగ్స్(CSK)ను గెలిపించినట్లుగా తాను రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (TVK)ను గెలిపిస్తానని పార్టీ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishore) అన్నారు. టీవీకేను తలపతి విజయ్ గా అభివర్ణించిన ప్రశాంత్ కిషోర్ విజయ్ పార్టీని గెలిపిస్తే ధోని కన్నా నాకే ఎక్కువ పాపులారిటీ తమిళనాడులో వస్తుందన్నారు. వచ్చే వంద రోజుల్లో టీవీకే పార్టీని పదింతలు పటిష్టంగా కార్యకర్తలు మార్చాలి" అని ప్రశాంత్ కిషోర్ పిలుపునిచ్చారు.

నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) తొలి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చెన్నై మామల్లపురంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు హాజరైన ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా రాజకీయ అవినీతి తమిళనాడులో ఉందని... అవినీతి, కమ్యూనిజం, కుటుంబ పాలనా తమిళనాడులో పోవాలన్నారు. తమిళనాట అవినీతి, కుటుంబ పాలనా పోవాలంటే విజయ్ లాంటి వ్యక్తి రావాల్సిన అవసరముందన్నారు.

విజయ్ కి నా ఆలోచనలు, వ్యూహాలు అవసరం లేదన్నారు. ఆయన ఆలోచనలు, సమాజంపై ఉన్న ప్రేమ, బాధ్యత నాకు తెలుసని..అందుకే విజయ్ కి సహాయం చేయడానికి ముందుకు వచ్చానన్నారు. గత నాలుగేళ్లుగా నేను ఏ రాజకీయ పార్టీ కోసం పనిచేయలేదన్నారు. కానీ నేను ఈ వేడుకకు రావడానికి నా బ్రదర్ విజయ్ నే కారణమని చెప్పారు.

టీవీకే పార్టీ ఒక కొత్త రాజకీయ చరిత్రను తమిళనాడులో సృష్టించబోతుందని.. తమిళనాడు మార్పు కోరుకుంటోందని.. ఆ సమయం వచ్చిందని..ఒక కొత్త రాజకీయాన్ని విజయ్ ప్రజలకు పరిచయం చేస్తారని.. గత 35 ఏళ్లుగా ఉన్న రాజకీయాన్ని విజయ్ తన ఆలోచనలతో మార్పు తీసుకుని వస్తారని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ గెలిచిన తర్వాత నేను స్వయంగా తమిళంలో మాట్లాడి ప్రజలకు కృతజ్ఞతలు చెబుతానని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.

Next Story

Most Viewed