బీజేపీని ఓడించడం సాధ్యం కాదు.. ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు

by Shiva |
బీజేపీని ఓడించడం సాధ్యం కాదు.. ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అధికార బీజేపీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా విపక్షాల ఐక్యత పరిమళిస్తోంది. వీటన్నింటి మధ్య, ఎన్నికల వ్యూహకర్త, జాన్ సూరజ్ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యత అస్థిరంగా, సైద్ధాంతికంగా భిన్నంగా ఉన్నందున 2024లో ఈ పాచిక పారదని అప్పుడే తేల్చేశారు.

అదేవిధంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వల్ల కలిగే ప్రయోజనాలను కూడా చర్చించారు. విపక్షాల ఐక్యత కేవలం ఆరంభ శూరత్వమేనని కేవలం పార్టీలను, నాయకులను ఒక్కతాటిపైకి తీసుకురావడం ఏమాత్రం సాధ్యం కాదన్నారు. ఇటీవల ఆయన ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2024 ఎన్నికల గురించి చర్చించి, ఎన్నికలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పార్టీలను, నేతలను ఏకతాటిపైకి తీసుకుని బీజేపీని సవాల్ చేయలంటే..ఆ పార్టీ బలాన్ని అర్థం చేసుకోవాలన్నారు. హిందుత్వ, జాతీయవాదం, లబ్ధిదారులే బీజేపీకి బలాలు వాటిపై పోరాడాలంటే కఠినంగా పని చేయాల్సి ఉంటుందని పీకే అన్నారు.

సిద్దాంతాలకు వ్యతిరేకంగా కూటమిలు ఏర్పాటు చేసుకున్నా.. విపక్షాల ఐక్యత చాలా ముఖ్యమన్నారు. బీహార్‌లో మహాకూటమి అనేది కేవలం పార్టీల కూటమి కాదు.. ఇది సిద్ధాంతాల కూటమి అన్నారు. హిందుత్వ భావజాలంపై పోరాడాలంటే సిద్ధాంతాల కూటమి ఉండాలని.. గాంధీవాది, అంబేద్కరిస్టులు, సోషలిస్టులు, కమ్యూనిస్టుల భావజాలం చాలా ముఖ్యమైనది, కానీ భావజాలం ఆధారంగా గుడ్డి విశ్వాసాన్ని కలిగి ఉండకూడదని అన్నారు. మీడియాలో మీరు ప్రతిపక్ష కూటమిని పార్టీలు, నాయకులు కలిసి రావడం అని చూస్తున్నారని తెలిపారు. ఎవరు ఎవరితో భోజనం చేస్తున్నారు, ఎవరిని టీకి ఆహ్వానిస్తున్నరనే దానిని తాను భావజాల నిర్మాణంలో చూస్తానని అన్నారు. అప్పటి వరకు సైద్ధాంతిక పొత్తు జరగే అవకాశమే ఉండదని, బీజేపీని ఓడించే అవకాశం లేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed