- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ishan Kishan: రాజకీయాల్లోకి క్రికెటర్ ఇషాన్ కిషన్ తండ్రి.. జేడీయూలో చేరిక
దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌కు చెందిన భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ (Ishan kishan) తండ్రి ప్రణవ్ పాండే (Pranav pandey) రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆదివారం ఆయన బిహార్ సీఎం నితీశ్ కుమార్ (Nithish kumar) నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (Jdu)లో చేరారు. ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాజ్యసభ ఎంపీ సంజయ్ ఝా(Sanjay Jha) సమక్షంలో పార్టీ సభ్యత్వం(party member ship) తీసుకున్నారు. ఆయనతో పాటు అనేక మంది జేడీయూలో చేరారు. పార్టీ బలోపేతానికి సైనికుడిలా కృషి చేస్తానని ప్రణవ్ తెలిపారు. అంకితభావంతో పని చేస్తానని స్పష్టం చేశారు. సీఎం నితీశ్ చేపట్టే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. నిజాయితీతో కూడిన అభివృద్ధే నితిశ్ విధానమని ఆయనపై ఎప్పటి నుంచో పూర్తి విశ్వాసం ఉందని కొనియాడారు. సంజయ్ ఝా మాట్లాడుతూ.. ప్రణవ్ చేరికతో మగద్ ప్రాంతంలో పార్టీ ఎంతగానో బలపడుతుందని తెలిపారు. కాగా, ప్రణవ్ పాండే ఒక వ్యాపారవేత్త(Business man). ఆయన కుటుంబ సభ్యులు కూడా గతంలో సమతా పార్టీ(Samath party)లో పనిచేసినట్టు తెలుస్తోంది.