- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Narayana Murthy : ఉద్యోగుల పని గంటలపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మరోసారి హాట్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే యువత వారానికి 70 గంటలు పని చేయాలని గతంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు (Infosys co-founder Narayana Murthy) నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారం రేకెత్తించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఉద్యోగుల పని గంటల (working hours) పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన (CNBC Global Leadership Summit) సీఎన్బీసీ గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్లో నారాయణ మూర్తి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తుది శ్వాస వరకు పనిగంటలపై నాది అదే మాట అని చెప్పుకొచ్చారు.
వారానికి ఆరు రోజుల పని దినాలు ఉండాల్సిందేనని వెల్లడించారు. (India) భారత్ ఆర్థికంగా పురోగమించాలంటే కష్టపడే మనస్తత్వం, అంకిత భావం అవసరమని వ్యాఖ్యనించారు. 1986లో భారత్‌లో ఆరు రోజుల పనిదినాలను ఐదు రోజులుగా మార్చినప్పుడు తీవ్ర నిరాశకు లోనయినట్లు తెలిపారు. ఈ మార్పు తాను ఎన్నటికీ అంగీకరించలేదని చెప్పారు. దేశ ప్రగతి సాధించాలంటే కష్టపడి పనిచేయడం తప్పనిసరి అని అన్నారు. అవిశ్రాంత అంకితభావానికి ప్రధాని మోడీ నమూన అని సూచించారు.