పాకిస్తాన్ కు ఇండియా అల్టీమేటం

by Y. Venkata Narasimha Reddy |
పాకిస్తాన్ కు ఇండియా అల్టీమేటం
X

దిశ, వెబ్ డెస్క్ : దాయాది దేశం పాకిస్తాన్ కు భారత్ అల్టీమేటం జారీ చేసింది. సింధు నదీ జలాల వివాదంలో భారత్ నూతన ఒప్పందాలను డిమాండ్ చేస్తూ పాకిస్తాన్ కు నోటీస్ లను జారీ చేసింది. మారుతున్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సింధు నదీజలాల పంపకాల్లో 1960 నాటి ఒప్పందాన్ని కొనసాగించటం కుదరదని తేల్చి చెప్పింది. సింధు నదీజలాల ఒప్పందంలో మార్పులు చేయాలంటూ అల్టీమేటం జారీ చేసింది. ఈ నోటీస్ లలో ఇండియాలో పెరుగుతున్న నీటి అవసరాలు, క్లీన్ ఎనర్జీ ఆవశ్యకత గురించి ఇండియా ప్రస్తావించింది. అంతే కాకుండా తీవ్రవాదం పట్ల పాకిస్తాన్ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే చాలా అంశాల్లో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న భారత్.. ఇప్పుడు నీటి వాటాలను కూడా పునస్సమీక్షించాలని నోటీసులివ్వడం పాకిస్తాన్ కు మింగుడుపడని అంశం కానుంది. అసలే అధిక ధరలు..పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో అతలాకుతలమవుతున్న పాకిస్తాన్ కు భారత్ నుంచి నదీ జలాల వాటా పేచి మరింత ఇబ్బందికమేనంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed