రుణాల చెల్లింపు గడువును పొడిగించేందుకు భారత్ గ్రీన్ సిగ్నల్: మాల్దీవుల విదేశాంగ మంత్రి

by S Gopi |
రుణాల చెల్లింపు గడువును పొడిగించేందుకు భారత్ గ్రీన్ సిగ్నల్: మాల్దీవుల విదేశాంగ మంత్రి
X

దిశ, నేషనల్ బ్యూరో: మాల్దీవులలో భారత సహాయక ప్రాజెక్టులను వేగవంతం చేసే విషయంలో గణనీయమైన పురోగతి సాధించామని ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ చెప్పారు. ఈ ప్రాజెక్టుల పునఃప్రారంభం, పూర్తి చేసేందుకు ప్రభుత్వం సహకారం ఉందన్నారు. మొదటి ద్రైపాక్షిక అధికారిక పర్యటనలో ఈ నెల 8-10 మధ్య భారత పర్యటనకు వచ్చిన మూసా జమీర్ రాష్ట్రపతి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 'భారత ఆర్థిక సహాయంతో ప్రారంభించిన ప్రాజెక్టులను వేగవంతం చేసే లక్ష్యంతో కీలక విషయాలను పరిష్కరించేందుకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో చర్చలు జరిపాను. 200 మిలియన్ డాలర్ల రుణంలో 150 మిలియన్ డాలర్లకు సంబంధించి చెల్లింపుల గడువును పొడిగించడానికి మాల్దీవులకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని' ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో 50 మిలియన్ డాలర్లు చెల్లించామని, మిగిలిన మొత్తం చెల్లింపు వ్యవధిని పొడిగించడానికి భారత ప్రభుత్వం ఎలాంటి డిమాండ్లు చేయలేదని మూసా జమీర్ పేర్కొన్నారు. చైనా అనుకూలంగా ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మయిజూ ఆరు నెలల క్రితం బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాల్దీవుల విదేశాంగ మంత్రి తొలిసారి భారత పర్యటనకు రావడం చర్చనీయాంసం అయింది.

Advertisement

Next Story

Most Viewed