- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Mark Zuckerberg: భారత ఎన్నికలపై వ్యాఖ్యలు.. వెనక్కి తగ్గిన మెటా

దిశ, నేషనల్ బ్యూరో: భారత ఎన్నికలపై చేసిన వ్యాఖ్యల విషయంలో మెటా వెనక్కి తగ్గింది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆయనపై చర్యలకు సిద్ధమైంది. ఈక్రమంలోనే మెటా (Meta) స్పందిస్తూ.. భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేసింది. అనుకోకుండా జరిగిన పొరపాటును క్షమించాలని కోరింది. ప్రపంచవ్యాప్తంగా 2024లో జరిగిన ఎన్నికలపై జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలపై మెటా ఇండియా వైస్-ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ) శివనాథ్ తుక్రాల్ స్పందించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పోస్ట్ ఫ్యాక్ట్-చెకింగ్‌కు ప్రతిస్పందించారు. “ 2024 ఎన్నికలలో అనేక అధికార పార్టీలు తిరిగి ఎన్నిక కాలేదని మార్క్ చేసిన పరిశీలన అనేక దేశాలకు వర్తిస్తుంది. కానీ, భారతదేశానికి కాదు. ఇలా అనుకోకుండా జరిగిన తప్పిదానికి మేం క్షమాపణలు కోరుతున్నాం. భారత్ మెటాకు చాలా ముఖ్యమైన దేశం. అలానే ఈ దేశ సృజనాత్మక భవిష్యత్ లో మేం కీలక పాత్ర పోషించేందుకు ఎదురు చూస్తున్నాం” అని శివనాథ్ తుక్రాల్ రాసుకొచ్చారు.
జుకర్ బర్గ్ ఏమన్నారంటే?
జనవరి 10న జుకర్‌బర్గ్ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా గతేడాది జరిగిన ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. 2024 అతిపెద్ద ఎన్నికల ఏడాదిగా నిలిచిందని.. భారత్ సహా అనేక దేశాల్లో ఎన్నికలు జరిగాయన్నారు. అందులో ప్రతి చోటా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓడిపోయాయని రాసుకొచ్చారు. దీన్ని అశ్వినీ వైష్ణవ్ ఖండించారు. స్వయంగా జుకర్‌బర్గ్ నుంచి ఇలాంటి అసత్య సమాచారం రావడం తీవ్ర నిరాశకు గురిచేసిందన్న కేంద్రమంత్రి.. వాస్తవాలు, విశ్వసనీయతను కాపాడుకుందామంటూ మెటాను ట్యాగ్ చేశారు. ఈ క్రమంలోనే మెటా స్పందిస్తూ భారత్‌కు క్షమాపణలు తెలియజేసింది.