- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్.. వరుసగా ఐదోసారి
దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలో అత్యున్నత విద్యాసంస్థగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), మద్రాస్ మరోసారి ర్యాంక్ సాధించింది. అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ వరుసగా ఐదో ఏడాది కూడా అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) బెంగళూరు మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ మేరకు నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాకింగ్ ఫ్రేమ్‌వర్క్ 2023 కింద కేంద్ర విద్యాశాఖ సోమవారం జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో దేశంలోని వివిధ విద్యాసంస్థలకు ర్యాంకులను కేటాయించింది. ఓవరాల్‌గా అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్ మొదటి స్థానంలో నిలువగా.. ఐఐఎస్సీ బెంగళూరు రెండో స్థానంలో, ఐఐటీ ఢిల్లీ మూడో స్థానంలో నిలిచాయి.
ఫార్మసీలో హైదరాబాద్ ఎన్‌ఐపీఈఆర్...
ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ మద్రాస్ వరుసగా ఎనిమిదో సంవత్సరం కూడా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ విభాగంలో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే తర్వాత రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. కాలేజీల విభాగంలో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన మిరాండా హౌస్, హిందూ కళాశాల కళాశాలలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. చెన్నై ప్రెసిడెన్సీ కాలేజ్ తర్వాత మూడో స్థానంలో ఉంది. పరిశోధన విభాగంలో ఐఐఎస్‌సీ బెంగళూర్ ఉత్తమమైన సంస్థగా నిలిచింది. ఐఐటీ కాన్పూర్ ఆవిష్కరణలకు ఉత్తమ ర్యాంక్‌ను పొందాయి. మేనేజ్‌మెంట్ కాలేజీల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), అహ్మదాబాద్ అగ్రస్థానంలో ఉన్నాయి.
అలాగే ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోజికోడ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఫార్మసీ విభాగంలో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఎన్‌ఐపీఈఆర్) మొదటి స్థానంలో నిలిచింది. జామియా హమ్దార్ద్, బిట్స్ పిలానీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. లా విద్యా సంస్థల్లో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా.. నేషనల్ లా యూనివర్సిటీ, ఢిల్లీ , నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.