- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amit Shah: అత్యంత అవినీతిమయ సర్కార్.. సోరెన్ ప్రభుత్వంపై అమిత్ షా విమర్శలు
దిశ, నేషనల్ బ్యూరో: హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం.. అత్యంత అవినీతిమయ సర్కారుగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జార్ఖండ్(Jharkhand)లోని పాలము ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అవినీతిపరులను తలకిందులుగా వేలాడదీస్తామని హెచ్చరించారు. జార్ఖండ్ లో పెరుగుతున్న అక్రమ చొరబాటుదారుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది తమ పొలిటికల్ అజెండా అని సీఎం హేమంత్ సోరెన్(Hemant Soren) విమర్శిస్తున్నారని అన్నారు. సోరెన్ వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని నిప్పులు చెరిగారు.
రిజర్వేషన్ల గురించి..
ఓబీసీ కోటాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహారాష్ట్రలోని కొన్ని వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని అమిత్ షా గుర్తుచేశారు. అయితే, మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం అనే విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) గుర్తుంచుకోవాలన్నారు. ‘రాహుల్ గాంధీ తన వెంట ఎప్పుడూ రాజ్యాంగాన్ని తీసుకెళ్లి, ప్రచారాల్లో దానిని చూపిస్తుంటారు. కాంగ్రెస్ నేత నకిలీ రాజ్యాంగ ప్రతిని చూపిస్తూ దానిని అపహాస్యం చేస్తున్నారు’ అని అమిత్ షా ఫైర్ అయ్యారు. జమ్మూకశ్మీర్ ఎన్నటికీ భారత్‌లో అంతర్భాగమేనని.. ఎన్ని తరాలు వచ్చి అడిగినా ఆర్టికల్ 370(Article 370)ని పునరుద్ధరించే అవకాశం లేదని షా నొక్కి చెప్పారు.