Hussain Dalwai: ప్రధాని మోడీ ఎక్కడికి వెళ్లినా సమస్యే ఉంది: కాంగ్రెస్ నేత హుస్సేన్ దల్వాయ్

by vinod kumar |
Hussain Dalwai: ప్రధాని మోడీ ఎక్కడికి వెళ్లినా సమస్యే ఉంది: కాంగ్రెస్ నేత హుస్సేన్ దల్వాయ్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హుస్సేన్‌ దల్వాయ్‌ స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. మోడీ ఎక్కడికి వెళ్లినా అక్కడ సమస్యలే ఎదురవుతున్నాయని ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మోడీ హయాంలో చేపట్టిన నూతన నిర్మాణాలన్నింటిలోనూ లోటు పాట్లు ఉన్నాయి. కొత్త పార్లమెంట్‌లో నీటి లీకేజీ ప్రాబ్లమ్, అటల్‌ సేతు వంతెన కూడా సమస్యలు ఎదుర్కొంటుంది. తాజాగా శివాజీ విగ్రహం కూలిపోయింది. కాబట్టి మోడీ ఎక్కడికి వెళ్లినా సమస్యలే అధికంగా ఉంటున్నాయి’ అని వ్యాఖ్యానించారు.

శివాజీ విగ్రహాన్ని నీటిలో తయారు చేయాలంటే వేచి ఉండాల్సిందని చెప్పారు. నీటిలో విగ్రహం నిర్మించాల్సి వస్తే, వారు ముంబైలో నిర్మించొచ్చని తెలిపారు. మోడీ విగ్రహాన్ని ఆవిష్కరించడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోపించారు. బీజేపీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి దేశంలో నిరుద్యోగాన్ని తీవ్రంగా పెంచిందని తెలిపారు. శివసేన(యూబీటీ) నేత ఆథిత్య థాక్రే మాట్లాడుతూ..ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూడా బీజేపీ అవినీతికి ప్రభావితం అవుతుందని ఎప్పుడూ ఊహించలేదని ఎద్దేవా చేశారు. కాగా, సింధుదుర్గ్‌లో శివాజీ విగ్రహాన్ని 2023 డిసెంబర్‌లో నేవీ డే రోజున ప్రధాని మోడీ ఆవిష్కరించారు.

Advertisement

Next Story

Most Viewed