- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తిరువనంతపురంలో మళ్లీ ఆయనదే గెలుపు: నటుడు ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని తిరువనంతపురంలో మరోసారి కాంగ్రెస్ నేత శశిథరూర్ గెలవబోతున్నారని నటుడు ప్రకాశ్ రాజ్ దీమా వ్యక్తం చేశారు. శశిథరూర్ ఎంపీగా గెలిచి లోక్‌సభకు వెళ్లడం ఖాయమని చెప్పారు. మంగళవారం ఆయన తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడారు. శశిథరూర్ గత కొంత కాలంగా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసినట్టు గుర్తించానని తెలిపారు. మా ఇద్దరికీ దశాబ్ద కాలంగా ఎంతో స్నేహం ఉందని చెప్పారు. థరూర్ ఎంతో గొప్ప వ్యక్తి అని, ఆయనకు మద్దతు తెలపడానికే ఇక్కడకు వచ్చానని వెల్లడించారు. శశిథరూర్ గెలుపును ఎవరూ ఆపలేరని తెలిపారు. ఇక్కడ బీజేపీ తరఫున కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్, సీపీఎం తరఫున పన్నియన్ రవీంద్రన్ బరిలో నిలిచారు. అయితే సీపీఎం ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేరళలో సీట్ షేరింగ్ కుదరలేదు. కాగా, 2009 నుంచి శశిథరూర్ తిరువనంతపురం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేరళలోని మొత్తం 20 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 26న ఒకే దశలో పోలింగ్ జరగనుంది.