నందిగ్రామ్, పూర్బా మేదినీపూర్‌లో హైటెన్షన్.. భారీగా మోహరించిన భద్రతా సిబ్బంది

by Mahesh |   ( Updated:2024-05-23 11:29:30.0  )
నందిగ్రామ్, పూర్బా మేదినీపూర్‌లో హైటెన్షన్.. భారీగా మోహరించిన భద్రతా సిబ్బంది
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్, పూర్బా మేదినీపూర్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల మధ్య వార్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే గత రాత్రి నందిగ్రామ్ లోని బీజేపీ కార్యకర్తలు ఇళ్లపై టీఎమ్‌సీ కార్యకర్తలతో పాటు అల్లరీ మూకలు దాడులు చేశారు. ఈ దాడుల్లో బీజేపీ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ, స్థానిక ప్రజలు ఈ రోజు తెల్లవారుజామున నిరసన వ్యక్తం చేసి.. రహదారిని దిగ్బంధించారు. టీఎంసీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని స్థానిక పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తూ పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరారు. దీంతో అప్రమత్తమైన ఈసీ, భద్రతా బలగాలు నందిగ్రామ్, పూర్బా మేదినీపూర్ లో భద్రతా సిబ్బంది మోహరించారు. ప్రస్తుతం అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు ఐదు విడతల్లో పోలింగ్ పూర్తి కాగా ఈ నెల 26న ఆరో విడత పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అత్యధికంగా అల్లర్లు మర్డర్లు జరిగినట్టు నివేదికలు తెలుపుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed