- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Rameswaram: రామేశ్వరంలో భక్తురాలికి ఛేదు అనుభవం.. దుస్తులు మార్చుకునే రూంలో సీక్రెట్ కెమెరా

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం రామేశ్వరం ఆలయ(Rameswaram temple) తీరంలో ఓ భక్తురాలికి ఛేదు అనుభవం జరిగింది. సోమవారం అగ్నితీర్థం బీచ్ లో పుదుకోట్టైకి చెందిన మహిళ సముద్రస్నం చేసి దుస్తులు మార్చుకునేందుకు ప్రైవేటు గదిలోకి వెళ్లింది. కాగా.. దుస్తులు మార్చుకునే బూత్‌లో సీక్రెట్ కెమెరాను గుర్తించింది. దీంతో, అప్రమత్తమైన మహిళ కుటుంబసభ్యులు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రామేశ్వరంలోని అగ్నితీర్థం(Agnitheertham beach) బీచ్‌లో భక్తులు పవిత్ర స్నానం చేస్తారు. వారి స్నానం తర్వాత బట్టలు మార్చుకునేందుకు వీలుగా ప్రైవేట్ సంస్థలు దుస్తులు మార్చుకునే గదులను అందిస్తాయి. అలా దుస్తులు మార్చుకునే బూత్ లోనే మహిళ సీక్రెట్ కెమెరాను గుర్తించింది. కాగా.. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కెమెరాను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కాగా.. బూత్ యజమాని రాజేష్ ను అక్కడికక్కడే అరెస్టు చేశారు. ఇదే కేసులో సమీపంలోని టీస్టాల్ లో పనిచేస్తున్న మీరా మొయిదీన్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా.. దీనిపై పూర్తిస్థాయి ఆపరేషన్ చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో అలాంటి ఇతర కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతుందన్నారు.