తారా స్థాయికి నీటి కష్టాలు.. హోలీ వేడుకల్లో నీటిని వృధా చేసినందుకు భారీగా ఫైన్

by Mahesh |
తారా స్థాయికి నీటి కష్టాలు.. హోలీ వేడుకల్లో నీటిని వృధా చేసినందుకు భారీగా ఫైన్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని పలు జిల్లాలో తాగునీటి సమస్య రోజు రోజుకు పెరిగిపోతుంది. వేసవి రాకముందే నీటి సమస్య ప్రజలను వెంటాడుతుండటంతో అక్కడి వారు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం నీటిని ఆచి తూచి వినియోగించుకోవాలని ఆర్డర్ వేస్తుంది. ముఖ్యంగా బెంగళూరు పట్టణంలో నీటి సమస్య తారాస్థాయికి చేరుకుంది. నీరు సరిగ్గా లేక పారిశ్రామిక వాడల్లో ఉన్న కంపెనీల ఏసీ నీళ్ళు వృధా చేయకుండా మళ్లీ తిరిగి వాటిని ఉపయోగిస్తున్నారు. నిత్యావసరాలకు డ్రైనేజ్ నుండి శుద్ధి చేసిన నీటిని ఉపయోగిస్తున్నారు.

ఈ క్రమంలోనే హోలీ పండుగ వేళ ఎవరు నీటిని వృధా చేయవద్దని.. అనవసరంగా కార్లను, బైకులను కడగవద్దని అధికారులు ఆర్డలు వేశారు. ఇది పట్టించుకోకుండా హోలీ వేడుకల్లో నీటిని వృధా చేసిన వారిపై ఫైన్ వేశారు. అలాగే.. కార్లు కడుగుతున్న 22 మందిని గుర్తించి రూ. 5000 చొప్పున మొత్తం రూ. 1.10 లక్షల ఫైన్ బెంగళూరు వాటర్ సప్లై అధికారులు వేశారు. వేసవి ప్రారంభంలోనే అక్కడి పరిస్థితులు ఇలా ఉంటే మే నెలలో ఎలా ఉంటాయో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా నీటి సమస్యను తీర్చేందుకు కర్ణాటక ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

Advertisement

Next Story