ఫుల్‌గా తాగి పట్టాల వద్ద పడుకున్నాడు.. రైలు వచ్చి కొట్టేసింది.. ఆ తర్వాత!

by Jakkula Mamatha |
ఫుల్‌గా తాగి పట్టాల వద్ద పడుకున్నాడు.. రైలు వచ్చి కొట్టేసింది.. ఆ తర్వాత!
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల సామాజిక మాధ్యమా(Social Media)ల్లో మందుబాబులకు సంబంధించిన వీడియో(Videos)లు తెగ వైరలవుతున్నాయి. కొందరు ఫుల్‌గా మద్యం సేవించి వాహనాలకు ఎదురుగా వెళ్లి ఆపడం లేదా బస్సు, రైళ్ల(Train)లో చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చేస్తుంటారు. కొన్నిసార్లు ప్రయాణికులకు ఇబ్బందులు కూడా కలుగజేస్తుంటారు. కొందరైతే వాళ్లు ఏం చేస్తున్నారో కూడా తెలియనంత మత్తులో ఏకంగా రోడ్డు(Road)పై, మురుగు నీటిలో పడుకోవడం కూడా చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట నిత్యం దర్శనమిస్తూనే ఉంటున్నాయి.

తాజాగా.. ఓ మందుబాబు నిర్వాకానికి సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఓ వ్యక్తి ఫుల్‌గా మందు తాగి రైలు పట్టాలపై పడుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. పెరూరులో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. మద్యం మత్తులో జోగుతున్న జువాన్ కార్లోస్(Juan Karlos) అనే వ్యక్తి రైలు పట్టాల వద్ద పడుకున్నాడు. ఈ క్రమంలో దూసుకొచ్చిన రైలు అతడిని ఢీ కొట్టి ఈడ్చుకు పోయింది. అయితే ఆ రైలు అతడిని ఢీ కొట్టిన కూడా.. అతనికి ఏమి కాకపోవడం గమనార్హం. ఈ క్రమంలో రైలు ధాటికి మత్తు వదిలిన ఆ వ్యక్తి లేచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. సీసీ కెమెరాలో రికార్డైన ఆ ఫుటేజీని సోషల్ మీడాయాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భూమ్మీద అతనికి ఇంకా నూకలున్నట్లున్నాయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story

Most Viewed