- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Haryana: హర్యానాలో వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి.. నిందితుడి అరెస్ట్!
దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యపై దేశ వ్యా్ప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్న వేళ హర్యానాలో మరో దారుణం చోటు చేసుకుంది. రోహ్‌తక్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీజీఐఎంఎస్)లో ఒక డాక్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ డెంటల్ విద్యార్థిని ఆరోపించింది. ఆగస్టు 16న నిందితులు తనను పీజీఐఎంఎస్ నుంచి కిడ్నాప్ చేసి అంబాలా, చండీగఢ్‌లకు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టి దారుణంగా కొట్టారని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు రోహ్ తక్ పోలీసులు చెప్పారు. అంతేగాక బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు ఆమె వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసినట్లు తెలిపారు. అయితే విచారణలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఇంకా వెలుగులోకి రాలేదని వెల్లడించారు. నిందితుడు పీజీఐఎంఎస్‌లోనే పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థి అని, బాధితురాలికి గత కొన్ని నెలలుగా తెలుసునని తెలిపారు. నిందితుడు ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడని, తదుపరి విచారణ తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.
బెంగళూరులో డిగ్రీ విద్యార్థినిపై!
కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ ఓ యువతిపై లైంగిక దాడి ఘటన వెలుగు చూసింది. డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న ఓ విద్యార్థిని కోరమంగళ్ ప్రాంతంలో ఆదివారం ఓ కార్యక్రమానికి వెళ్లింది. ఈ క్రమంలో ఇంటికి వస్తుండగా..ఆమె కారు ఆగిపోయింది. దీంతో రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తిని లిఫ్ట్ అడగగా ఆమెను బైకుపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు సీనియర్ పోలీస్ అధికారి రామన్ గుప్తా వెల్లడించారు. నిందితుడి కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.