- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Haryana Elections: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే చివరి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బీజేపీ
దిశ, వెబ్‌డెస్క్:హర్యానా (Haryana) రాష్ట్రంలో అక్టోబర్ 5(October 5)న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ(BJP)ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల చివరి జాబితాను బుధవారం అర్థరాత్రి దాటినా తర్వాత విడుదల చేసింది. ఈ లిస్టులో మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.దీంతో మొత్తం 90 స్థానాలకు 90 అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన చివరి జాబితాలో సిర్సా(Sirsa) నుంచి రోహ్తాష్ జాంగ్రా(Rohtash Jangra), మహేంద్రగఢ్(Mahendragarh) నుంచి కన్వర్ సింగ్ యాదవ్(Kanwar Singh Yadav), ఫరీదాబాద్ ఎన్ఐటీ(Faridabad NIT) నుంచి సతీష్ ఫగ్నా(Satish Fagna)లను పార్టీ బరిలోకి దించింది.
కాగా అంతకుముందు సెప్టెంబర్ 10న బీజేపీ పార్టీ 21 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ జాబితాలో జులనా(Julana) అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్(Congress) తరుపున బరిలోకి దిగనున్న వినేష్ ఫోగట్(Vinesh Phogat)పై ఆ పార్టీ కెప్టెన్ యోగేష్ బైరాగి(Yogesh Bairagi)ని పోటీలోకి దింపింది.కాగా 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో నామినేషన్ల దాఖలుకు గురువారం చివరి రోజు కాగా.. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది.హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir)తో పాటు అక్టోబర్ 8న ప్రకటించనున్నారు.