- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Haryana election: హర్యానాలో ఆప్ ఆరో జాబితా రిలీజ్..19 మంది అభ్యర్థుల ఖరారు
దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరో జాబితాను గురువారం రిలీజ్ చేసింది. 19 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పంచకుల సెగ్మెంట్ నుంచి సీనియర్ నాయకుడు ప్రేమ్ గార్గ్‌కు అవకాశమిచ్చింది. అలాగే మరో సీనియర్ నేత మనీష్ అరోరాను ఎల్లినాబాద్ నుంచి బరిలో నిలిపింది. ఇప్పటికే ఐదు జాబితాల్లో 70 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆప్.. ఇప్పటి వరకు 89 మంది క్యాండిడేట్స్‌ను ఖరారు చేసింది. మరో స్థానం మిగిలి ఉంది. అంతుముందు ఒకే రోజు మూడు లిస్టుల్లో అభ్యర్థులను ప్రకటించింది. కాగా, నామినేషన్ల దాఖలుకు గురువారమే చివరి తేదీ కావడం గమనార్హం. దీంతో కాంగ్రెస్, బీజేపీలు సైతం తమ అభ్యర్థులను ప్రకటించాయి. హర్యానాలో ఆప్ ఒంటరిగా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని భావించినప్పటికీ సీట్ షేరింగ్ విషయంలో ఒప్పందం కుదరలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.