Guruprasad: స్టార్ డైరెక్టర్ గురుప్రసాద్ సూసైడ్.. ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం

by vinod kumar |
Guruprasad: స్టార్ డైరెక్టర్ గురుప్రసాద్ సూసైడ్.. ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ కన్నడ నటుడు, డైరెక్టర్ గురుప్రసాద్(Guruprasad) (52) కన్నుమూశారు. బెంగళూరు(Bengaluru)లోని తన అపార్ట్ మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. దసనాపుర (Dhanasapura) పరిసరాల్లోని గురుప్రసాద్ ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నట్టు చుట్టుపక్కల వారు పసిగట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గురుప్రసాద్ ఇంట్లో తనిఖీలు చేపట్టగా డ్రాయింగ్ రూమ్‌లో(Drawing Room) సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో కొద్దిరోజుల క్రితమే ఆయన సూసైడ్‌కు పాల్పడినట్టు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

కన్నడ సినీ ప్రముఖుల్లో గురుప్రసాద్ ఒకరు. 1972 నవంబర్ 2న బెంగళూరులో జన్మించిన ఆయన.. మఠం మూవీతో సినీమా ఇండస్ట్రీలోకి రంగ ప్రవేశం చేశారు. మాట, ఎద్దేలు మంజునాథ, డైరెక్టర్స్ స్పెషల్ వంటి హిట్ సినిమాలతో ఫేమస్ అయ్యారు. అయితే గురు ప్రసాద్ అప్పుల బారిన పడినట్టు తెలుస్తోంది. అప్పులు ఇచ్చిన వారు అతనిపై ఒత్తిడి తెచ్చారు. అలాగే ఇటీవల ఆయన తీసిన రంగనాయక చిత్రం(Ranganayaka movie) ఫ్లాప్ కావడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. గురుప్రసాద్ మరణం పట్ట సినిమా ఇండస్ట్రీ ప్రతినిధులతో పాటు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. ‘ఎన్నో మంచి చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు గురుప్రసాద్ మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని మాజీ సీఎం బొమ్మై (Bommai) ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Advertisement

Next Story