ప్రధాని మోడీ డిగ్రీపై వ్యాఖ్యల కేసు.. కేజ్రీవాల్, ఎంపీ సంజయ్ సింగ్‌కు కోర్టు సమన్లు

by Vinod kumar |
ప్రధాని మోడీ డిగ్రీపై వ్యాఖ్యల కేసు.. కేజ్రీవాల్, ఎంపీ సంజయ్ సింగ్‌కు కోర్టు సమన్లు
X

అహ్మదాబాద్ (గుజరాత్) : ప్రధాని మోడీ డిగ్రీ పట్టాపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసినందుకు దాఖలైన పరువు నష్టం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ ఈనెల 13న తమ ఎదుట హాజరుకావాలని అహ్మదాబాద్ కోర్టు ఆదేశించింది. వాస్తవానికి వారిద్దరూ బుధవారం రోజే హాజరు కావాల్సి ఉండగా.. తమ తరఫున లాయర్లను కోర్టుకు పంపారు. తమ క్లయింట్ల(కేజ్రీవాల్‌, సంజయ్‌ సింగ్‌)కు కోర్టు హాజరు నుంచి మినహాయింపు కల్పించాలని లాయర్లు కోర్టును కోరారు.

గుజరాత్ యూనివర్సిటీ వేసిన పరువు నష్టం కేసుకు సంబంధించిన పత్రాలను అడిగి తీసుకున్నారు. వాదనలు విన్న కోర్టు.. అరవింద్‌ కేజ్రీవాల్‌, సంజయ్‌ సింగ్‌ లు జులై 13న విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. ప్రధాని మోడీకి తాము ప్రదానం చేసిన డిగ్రీపై కేజ్రీవాల్‌, సంజయ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యల వల్ల తమ విద్యాసంస్థ ప్రతిష్టకు భంగం వాటిల్లిందని ఆరోపిస్తూ గుజరాత్ యూనివర్సిటీ ఈ కేసు వేసింది.

Advertisement

Next Story