- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం ప్రియులకు భారీ గుడ్ న్యూస్..!
దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలోని కూల్ డ్రింక్స్ మార్కెట్ లో అగ్ర గ్రామిగా ఉన్న కోకా కోలా సంస్థ ఇకపై మందుబాబులకు కూడా అందుబాటులో ఉండనుంది. కోకా కోలా మొదటిసారిగా ఇండియాలో మద్యం మార్కెట్‌లోకి ప్రవేశించింది. తన లిక్కర్ బ్రాండ్ ‘లెమన్- డౌ’ ను తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతానికి పైలెట్ ప్రాజెక్ట్‌గా గోవా, మహారాష్ట్రలో విడుదల చేసింది. అక్కడి స్పందనను బట్టి దేశమంతా ఈ బ్రాండ్‌ను విడుదల చేయబోతుందట. ఇప్పుడు గోవాలో 250 ఎమ్‌ఎల్ క్యాన్ ధర రూ.150 కాగా, మహారాష్ట్రలో రూ.230 గా ఉంది. ఈ రెండు చోట్లా టెస్టింగ్ చేసిన తర్వాత మద్యం మిక్సింగ్‌లో ఏమైనా మార్పులు చేయాలో, లేదో పరీక్షించుకుని పూర్తి స్థాయిలో రిలీజ్ చేయాలని కోకా కోలా ఇండియా భావిస్తుందట. ఈ ‘లెమన్- డౌ’ ను కోకా కోలా కంపెనీ 2018లో జపాన్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ బ్రాండ్ జపాన్, ఫిలిప్పీన్స్, చైనా వంటి దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు ఇండియాకు కూడా పరిచయమైంది. ఇండియాలో మద్యం మార్కెట్ రాబోయే 5 ఏళ్లలో భారత్‌లో మద్యం మార్కెట్ 64 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా అంచనా వేస్తుంది.