- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Golden Temple: శిక్ష అనుభవించిన సుఖ్‌బీర్ సింగ్.. స్వర్ణ దేవాలయంలో సేవాదార్‌గా పనులు
దిశ, నేషనల్ బ్యూరో: శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగా పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (Sukhbir Singh Badal), ఇతర నాయకులకు అకాల్ తక్త్‌కు చెందిన మత గురువు ‘తంఖా’ అని పిలువబడే మతపరమైన శిక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం ఆయన శిక్ష అనుభవించారు. అమృత్‌సర్ (Amruthsar) లోని గోల్డెన్ టెంపుల్(Golden Temple)కు చేరుకున్న ఆయన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలోనే సేవాదార్‌గా పని చేశారు. టెంపుల్ ప్రవేశ ద్వారం వద్ద వీల్‌చైర్‌లో కూర్చొని మెడలో ఫలకం ధరించారు. ఈటె పట్టుకుని పలు పనులు చేశారు. చివరిగా పాత్రలు కడిగి ఆలయం నుంచి వెళ్లిపోయారు. మరో అకాలీదళ్ నేత సుఖ్ దేవ్ సింగ్ ధిండా (Sukhdev singh dhinda) కూడా ఇదే రకమైన శిక్ష అనుభవించాడు. సుఖ్‌బీర్ బాదల్‌కు టాయిలెట్‌లను శుభ్రం చేయాలని కూడా శిక్ష విధించారు. అయితే అతని కాలులో ఫ్రాక్చర్ కారణంగా దాని నుంచి మినహాయింపు పొందినట్టు తెలుస్తోంది. కాగా, 2007 నుంచి 2017వరకు పంజాబ్‌లో అధికారంలో ఉన్నప్పుడు పార్టీ చేసిన తప్పులకు సుఖ్‌బీర్ బాదల్‌ను అకల్ తఖ్త్ దోషిగా నిర్ధారించింది. అంతేగాక మతపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా శిక్ష విధించింది.